వాన పడేలా ఉంది
మబ్బు పట్టింది ఆకాశమేనా?
చిత్తడి నేల తడింకా ఆరనేలేదు
మళ్ళీ చినుకు రాలుతోంది
తడిసిపోతున్న తలపులే
సాక్ష్యంగా..!
పక్కటెముకలు లేని చక్క తలుపులను
ఎంతసేపు బిగించగలవు?
మట్టి గోడల మాటున ఎంతకాలం
నక్కి ఉండగలవు?
హోరుగాలి గోడు
వెళ్ళబోసుకుంటుంది
తన హోరులో తానే కలిసిపోయి ఘొల్లుమంటుంది
వాన వెలిసిపోతుంది...
తాను తీసుకొచ్చిన శకలాలను
వదిలిపోయిన శిధిలాలను
నిర్వికార వదనంతో అలా చూస్తూ
వెళ్ళిపోతుంది!!