నీ చిరునవ్వు...
మల్లెమొగ్గ విచ్చినట్టు
చల్లగాలి వీచినట్టు
మంచుచుక్క తాకినట్టు
సన్నజాజి పాకినట్టు
నీ చిరునవ్వే...
జలపాతం జారినట్టు
పారిజాతం దొరికినట్టు
నెమలి పింఛం విరిసినట్టు
నింగి కొంచెం అందినట్టు
అది నీ నవ్వే...
నీటి బుడగ తేలినట్టు
పాల తరగ పొంగినట్టు
పూలవాన కురిసినట్టు
మేఘమాల సాగినట్టు
నీ నగుమోము...
చందమామకి పున్నమొచ్చినట్టు
పల్లెటూరికి పండగొచ్చినట్టు
చంటిపాప నిద్దరోతున్నట్టు
పంటచేను కాపుకాసినట్టు
నువ్వు నవ్వుతున్నట్టు.. నువ్వే నవ్వుతూ ఉన్నట్టు
2 comments:
మొదట జాబితా కవితలా అనిపించినా తరచి చూస్తే మీ చిరునవ్వుకవితాంజలిలో కవనం మందహాసం చిలికిస్తున్నట్లే అనిపించింది!బోసినవ్వులపాప నడినిద్దురలో నవ్వినట్లు,పండక్కి కొత్తల్లుడు లోలోన చిరునవ్వినట్లు,సన్నజాజి గునగునపాకినట్లు,విరగకాసిన పంటచేనును చూసి చెమట కార్చిన రైతన్న నవ్వినట్లుంది ఎందుకంటే ఈరోజు secundarabad నుంచి minneapolis వచ్చినాక మా మనవడి సైకల్ కొనుగోలుకోసం Wallmart వెళ్ళి కొనివచ్చి చదివిన మొదటిబ్లాగ్లో మొదటి కవిత !!
నవ్వు నవ్వుని నవ్విస్తుంది...అదే జగమెరిగిన భాష.
Post a Comment