నా లేత నడుము చుట్టూ నీ చేతులు అల్లిన లతలు....
నా మెడపై నీ ముంగురులు పెట్టిన ముద్దులు....
నా చెంపలకు నీ పెదవులు అద్దిన కెంపులు....
నా పెదవంచున నీ వేలికొన వేసిన ముగ్గులు....
నా ఎదపై నీ కళ్ళు రాసిన కవితలు....
నా గతజన్మ స్వప్నాలు... జీవితకాల జ్ఞాపకాలు....!!