July 08, 2011 - , 8 comments

స్వీయ






తను నా ఆత్మీయ నేస్తం.. ఆజన్మాంత స్నేహం...
మనోభావ సౌరభాల కుసుమ మనసు
వెన్నెల రువ్వే వెండి వెలుగుల నవ్వు కలబోత తాను...
తనతో నా స్నేహం మధురాతి మధురం...మాటలకందని భావం..
ఎన్నో జ్ఞాపకాలు ఇంకెన్నో మధురానుభూతుల కలయిక మా స్నేహం...
పసితనపు పరిమళాలను నా చుట్టూ నింపి
మరో బాల్యాన్ని చవిచూపించిన చిన్నారి నేస్తం తాను...
అల్లరి చేయటమే విధిగా రోజులు గడిపినా
గమ్యం ఎరుగకపోయినా ప్రయాణం చేసినా
ఎర్రటి రసగుల్ల కొనుక్కు తిన్నా
అన్నం ముద్దలు పంచుకున్నా
అహంకారాలు పెంచకున్నా
మనసారా నవ్వుకున్నా
కడుపారా ఏడ్చినా
అన్ని తనతోనే...


అంతులేని ఎదలోతులను కంటి చూపుతోనే కొలిచేస్తుంది..
అంతలోనే ఎత్తుకోమని మారాం చేసే చంటి పాపైపోతుంది!
ఎంతవారినైనా లెక్కచేయని తెగువ చూపుతుంది..
వింతగా చిన్న విషయాలకి కన్నీరు పెడుతుంది!!
ఎన్నని చెప్పను... ఏమని చెప్పను...!!
తనతో గడిపిన ప్రతిక్షణం ఒక ఆణిముత్యం...
ఆనందమే అనునిత్యం...
ప్రతిరొజూ ఒక పగడపు హారం...
నాకు మాత్రమే దొరికిన వరం...



8 comments:

S 8 July 2011 at 12:10

అల్లరి చేయగలిగినా తనతోనే . .
గమ్యంలేని ప్రయాణాలు చెయ్యాలన్నాతనతోనే . .

రసగుల్లాలు తిన్నా, రుసరుసల కోపం చూపించినా . .
మనసారా నవ్వుకున్నా, మనసుకి నచ్చినదాన్ని పంచుకున్నా . .
గోరుముద్దలు తినిపించుకున్నా, గోడలు దూకి అల్లర్లు చేసినా . .
నా బాధను పంచుకున్న సమయంలో తన బాధను మనసులోనే మింగేసినా . .
తనతోనే . .
మనసులోని బాధను కడిగేసినా . .
మనసు తేలిక పడేదాకా కబుర్లు చెప్పినా . .
కడుపు పగిలిపోయేలా నవ్వుకున్నా . .
కోపం తెప్పించిన విషయాన్ని కసితీరా తిట్టుకున్నా . .
నచ్చిన పుస్తకం పంచుకున్నా. .
ఏం చెయ్యాలన్నా తనతోనే . .
తనతో మాత్రమే . . .

I LOVE YOU PRIYA :) :) :)

కవితాంజలి... 8 July 2011 at 12:24

"నా బాధను పంచుకున్న సమయంలో తన బాధను మనసులోనే మింగేసినా . ."
ఈ లైన్ అచ్చుగుద్దినట్టు అలానే రాసి ఎందుకో వద్దనిపించి తీసేసా....

S 8 July 2011 at 20:45

:) :P

Anonymous 19 July 2011 at 05:56

baagundi mee sneham

Krishna 25 July 2011 at 06:14

చిత్రమంత
అందంగా ఉంది
మీ కవిత!!

కవితంత
అందంగా ఉంది
మీ స్నేహం!!

స్నేహమంత
అందంగా ఉంది
మీ హృదయం!!

అభినందనలు & ధన్యవాదాలు.

yahoo 25 July 2011 at 10:48

nice one pic also!

Raj 25 October 2011 at 11:01

మీ ఇద్దరి స్నేహం ఇంకా ఇంకా మధురానుభూతులు లతో నిండాలని ఆకాంక్షిస్తున్నాను..

రవిశేఖర్ హృ(మ)ది లో 29 November 2011 at 06:21

chikkani chakkani chelimi
keep it up

Post a Comment

Popular Posts

.