"మనసు"




ఒక ఉహ....
ఆ ఉహ పేరు "మనసు"
ఎంత అందమైనదా ఉహ!
ఎంత విచిత్రమైనదా ఉహ!
ఎంత నిబ్బర, నిశ్చలమైనదా ఉహ!
ఎక్కడిది ఆ ఉహకంత శక్తి!?
ఎవరిస్తారు దానికా స్పూర్తి!?
ఎన్ని దెబ్బలు తగులుతాయి...
ఎన్నిసార్లు ముక్కలవతుంది...
ఎంత నెత్తురోడుతుంది...
అయినా....
 ఎలా వస్తుందో తనకి ఓపిక!!
ఎలా నిలుస్తుందో తనకి ప్రాణం!!

అగ్ని శిఖవుతుంది ఒక క్షణం..
మంచు ముద్దవుతుంది మరుక్షణం..
అంతలోనే అవమాన పడుతుంది..
వెంటనే అభిమానం కురిపిస్తుంది..
మోడువారినంతలోనే చిట్టి చిగురేదో మెరుస్తుంది..
ఎడారైపోయిందనుకుంటుండగానే స్వాతి చినుకేదో కురుస్తుంది.. 
ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నానంటూ వస్తుంది..
ఏకాంతం కోరుకుంటే మాటాడకుండా వెళ్ళిపోతుంది..
ఒక చిన్ని మనసుకి ఇన్ని మహిమలెలా సాధ్యమో!!
మనిషికి మనసే ఆధారం, మనసే ఆయుధం
మనిషిగా బ్రతికేందుకు మనసే అర్హత
బహుశా మనసు ఉహ కాదేమో...!
మనిషి మనుగడకు ఆటంకం రానివ్వక దోహదపడు
ఒక అతీతమైన, విశ్వవ్యాప్తమైన శక్తి కావొచ్చు...! 


3 comments:

S 14 July 2011 at 10:55

very diffrnt frm d others.. gud thought.. keep it up ra.. :)

కవితాంజలి... 15 July 2011 at 08:31

umm.... trying my best to write on different subjects apart from love..

Krishna 25 July 2011 at 06:06

ఎంత దర్శించినా
వెలితి తెలిపేది మనసు

ఎంత చదివినా
కలత తరగనిది మనసు

********************

బాధ మనిషిదైతే
మనసుది అవస్థ

********************

కవిత ఎంత చెప్పినా
రాగం ఎంత కూర్చినా
తెరలుగా కథలు
అల్లుతూనే ఉంటుంది
మనసు -
(***)
ఎంత ఊహించినా
ఎంత వర్ణించినా
చినుకులా అందాలు
చిందిస్తూనే ఉంటుంది
మనసు -
(***)

మనసు మరి
మాటలు కాదు!!!

అభినందనలు. :-)

Post a Comment

Popular Posts

.