ఈ తగువేమిటే మనసా..?
నాపై ఈ పగేమిటే మనసా...?
అందని దానికై ఆశ పడతావు...
ఆశ నిరాశల నడుమ నలుగుతావు..!
నిప్పని తెలిసీ ముట్టుకుంటావు...
భరించలేక భగ్నమైపోతావు..!
ఊహల ఉయ్యాలలూగుతావు...
తెగి పడిన కలల తీగలలో చిక్కుకుని నెత్తురోడుతావు..!
చేత ఉన్నదాన్ని జారవిడుచుకుంటావు...
చేరలేని దానికై పరుగందుకుంటావు..!
ప్రణయమనుకుని భ్రమసేవు...
ప్రళయమని తెలిసి వగచేవు..!
తప్పులన్నీనువ్వు చేస్తావు...
నిందలేమో నాపై మోపుతావు..!
ఇది నీకు న్యాయమా!?
ఇదే నీ ధర్మమా!?
చెప్పవే ఓ నా వెర్రి హృదయమా!!
మాట వినని మొండిఘటమా!!!
5 comments:
బాగుందండీ కవిత, అందుకే అది 'భగ్న హృదయం' అయ్యింది. దాని మాట వింటే అది భగ్నం కాదేమో కదూ!
superb.
భారమైనా భావమున్న కవిత!
హా హ హా భలే నవ్వోస్తుందండి...
తప్పులన్నీనువ్వు చేస్తావు...
నిందలేమో నాపై మోపుతావు..!
చెప్పవే ఓ నా వెర్రి హృదయమా!!
మాట వినని మొండిఘటమా!!!
భలే...భలే...చాల లైట్ గా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ని చెప్పిన విదానం భావుంది.
ఆశ నిరాశల నడుమ నలుగుతావు..!
నిప్పని తెలిసీ ముట్టుకుంటావు...
భరించలేక భగ్నమైపోతావు..
ఈ మాటలు గుచ్చుకున్నయ్.. అపరంజితా గారు.. ప్రతి ఒక ప్రేమలొ ఉన్న హ్రుదయం భగ్నమైపొతుందేమొ...ఇలా
Post a Comment