నేటి కన్నా నిన్న తీపి..
నిన్న కన్నా రేపు తీపి..
నిన్న లేనే లేదు!
రేపు రానే రాదు!!
నిన్న-రేపటిల నడుమ
నేడు చిక్కుకున్నదేమిటి?
కదలనీ.. ముందుకు కదలనీ...
గతించిన నిన్నలో ఏముంది?
గతమైపోయిన జ్ఞాపకాలు తప్ప!
అగామియైన రేపటిలో ఏముంది?
అస్పష్టమైన ఆశలు తప్ప!
కని, విని, శ్వాసించి, స్పృశించి, ఆశ్వాదించగల నేటిని
కదలనీ.. ముందుకు కదలనీ...
స్తంభన చేతికి అప్పగించిన కళ్ళాలను
స్పందన చేజిక్కించుకోనీ
పంచకల్యాణిని పరుగులు తీయనీ
కదలనీ.. ముందుకు కదలనీ...
అడ్డుగోడలు, తులసి కోటలు అడ్డురానీ!
వేడి గాలులు, వాయుగుండాలు మింగివేయనీ!
ముళ్ళు కిరీటాలై అల్లుకోనీ!
రాళ్ళు వర్షాలై కురవనీ!
అడుగులను జడవనీకు
వెనుకకు మళ్ళనీకు
కదలనీ.. ముందుకు కదలనీ...
దిటవు చేసుకున్న గుండె ఆసరాగా
నిర్ణయించుకున్న నేటితో పాటుగా
సాగనీ.. నీ పయనం సాగనీ...
3 comments:
ప్రతీ నేడుకు, నిన్న, రేపు ఉంటునే ఉన్నాయి అపరంజితాగారూ..ఆఖరి నేడు వరకు ఈ జీవితం సాగవల్సిందే కదా ఎమంటరు,,,,!బా చెప్పరండి..
ఉమ్మ్.... అవును.. ప్రతి నేడుకు నిన్న, రేపు ఉంటాయి. కానీ నిన్న గతం. తిరిగి వెళ్ళలేము. రేపు భవిష్యత్తు. ఎప్పటికీ చేరలేము. అలాంటి వాటికోసం వర్తమానాన్ని నరకం చేసుకోవటం ఎందుకని నా ఉద్దేశం. అలాగే కొంతమంది గతంలో తగిలిన దెబ్బల్నే తలుచుకుంటూ, బాధ పడుతూ కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ప్రయోజనం లేకపోగా ఇంకాస్త బాధ ఎక్కువయ్యి మెదడు చెడిపోతుంది. మరికొంతమంది భవిష్యత్తు గురించి విపరీతమైన కలలు కంటూ ఆ కలల్లోనే బ్రతుకుతూ ఉంటారు. వారూ వర్తమానాన్ని ఉపయోగించుకోరు. అలాంటి వారికి కూడా "నేడు" లో ఉన్న జీవాన్ని గురించి చెప్పదల్చుకున్నాను. మరికొన్ని సందర్భాలలో రోజులు గడుస్తూనే ఉంటాయి, గడుస్తున్నట్టే అర్ధం కాకుండా కొంతమందికి! అంత స్తబ్దుగా జీవితాన్ని వెళ్లదీస్తారు. వారూ కాస్త కొత్త జీవం నింపుకున్న కళ్ళతో లోకాన్ని చూస్తే ఏ రోజుకారోజు ప్రతి "నేడు" ఆనందదాయకమే కదా....
హ్మ్ బా చెప్పారండి..ధన్యవాదాలు..మీ బ్లొగ్ కీ..ది మొస్ట్ అట్ట్రక్టివె బ్లొగ్ అవార్డు ఇచ్చెయొచ్చండి..మీ కవితలు లాగే..మీ మాటలు లాగే..చాలా....చాలా.... మనసుని పట్టెస్తుంది..awwww...
Post a Comment