మౌన సాక్షి...



ఎప్పుడూ అనుకోనేలేదు...
నేను ముచ్చటగా కట్టుకున్న
చిట్టి చిట్టి పిచ్చుక గూళ్ళను
అలలు మింగివేస్తాయని..!

నాకెవరూ చెప్పనే లేదు...
నేను ముద్దుగా పెంచుకున్న
ముద్దబంతి పూవులు
మూడునాళ్ళకే వాడిపోతాయని..!

నేను ఎరుగను గాగ ఎరుగను...
వాననీటిలో వదిలిన కాగితపు పడవలు
తడిసిముద్దై చిరిగిపోతాయని..!

నాకు తెలియదు...
నా గది కిటికీలో
గూడు కట్టుకున్న గువ్వలు
ఒకనాడు ఎగిరిపోతాయని..!

ఇప్పుడన్నీ జరుగుతున్నాయి...
అంతా అర్ధమవుతోంది...
ఏం చేయగలను?
జరుగుతున్నదానికి మౌన సాక్షిగా నిలవటం తప్ప!!

1 comments:

Anonymous 10 March 2013 at 05:51

సాహిత్యం సందర్బోచితంగా ఉంది.. మీరు అంత సమయం కేటాయించి జనరంజకమైన తెలుగు భాషామ=తాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది... భవిష్యత్ లో మరింత ఉన్నతమైన కవితలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.... 9395146294. గుడిపూడి గోపాలాక=ష్ణ. రాజమండ్రి. gudipudig@yahoo.com

Post a Comment

Popular Posts

.