వాన...

వాన పడేలా ఉంది
మబ్బు పట్టింది ఆకాశమేనా?
చిత్తడి నేల తడింకా ఆరనేలేదు
మళ్ళీ చినుకు రాలుతోంది
తడిసిపోతున్న తలపులే సాక్ష్యంగా..!
పక్కటెముకలు లేని చక్క తలుపులను
ఎంతసేపు బిగించగలవు?
మట్టి గోడల మాటున ఎంతకాలం
నక్కి ఉండగలవు?
హోరుగాలి గోడు వెళ్ళబోసుకుంటుంది
తన హోరులో తానే కలిసిపోయి ఘొల్లుమంటుంది
వాన వెలిసిపోతుంది...
తాను తీసుకొచ్చిన శకలాలను
వదిలిపోయిన శిధిలాలను
నిర్వికార వదనంతో అలా చూస్తూ వెళ్ళిపోతుంది!!

3 comments:

Krishna 10 July 2013 at 10:02

ghollumanadam positive tone lo cheptaramo kada.
tana horulo tane kalisipoyi ghollumantundi ane chota padam maarchi osari chustenooo............

కవితాంజలి... 10 July 2013 at 10:11

నాకు తెలిసినంత వరకూ ఘొల్లుమనటం పోసిటివ్ టోన్ కాదు వంశీ గారు... మీరు చెప్పారు కదా పరిశీలిస్తాను. :) థాంక్ యూ...

mehdi ali 25 August 2013 at 03:28

Excellent ...

Post a Comment

Popular Posts

.