వినీలాకాశంలో విహరించు విహంగపు రెక్కలలోని స్వేచ్చను నేనై
నిన్ను చేరుకోనా...
సంద్రమును దాటి పరవళ్ళు త్రొక్కు సెలయేటి
వేగము నేనై
వేగము నేనై
నిన్ను తాకిపోనా...
మలయమారుతమ్మును మోసుకునిపోవు చల్లగాలి చలువను నేనై
నిన్ను చుట్టుకోనా...
నింగి నేల ముద్దిడు అంచున విరిసే తొలిసంధ్య వెలుగును నేనై
నిన్ను చుంబించనా...
వెండి మబ్బుల మదిలో మెరిసి కురిసే పసిడి ధారల చినుకు నేనై
నిన్ను తడిపేయనా...
జిలుగు పూల తోటలో విరబూసిన జాబిలమ్మ
వెన్నెల నేనై
వెన్నెల నేనై
నిన్ను తడిమేయనా...
కొత్త చిగురు వేసిన కోకిలమ్మ గొంతులోని తీపి రాగాల గీతం నేనై
నిన్ను పెనవేయనా ...
3 comments:
last butone line lo mispelt wrd alaane undi ra..
and aasala alalu kanna kuda, aasala paravallu ani petti unte bavundedhemo aa pic ki, aa kavithaki.. aalochinchu..
but, chala bavundi kavita.. loved it :)
స్వీయ గారు,
తెలుగు రాదంటూనే అందమైన పదం సూచించారు.
ప్రియ గారు,
నాకైతే "సంద్రమును దాటి పరవళ్ళు త్రొక్కు సెలయేటి " మొత్తం మారిస్తే బావుండు అనిపిస్తుంది. నా అనుకోలు మాత్రమే మరోల భావించవద్దు.
krsn గారు,
"సంద్రమును దాటి పరవళ్ళు త్రొక్కు సెలయేటి " అని ఎందుకు అన్నానంటే... నదులు, సెలయేర్లు లాంటివన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి కదా... కానీ అక్కడితో ఆగకుండా సముద్రాన్ని కూడా దాటి ఇంకా ఎక్కడికో పరిగెత్తి పోవాలన్న బలమైన కోరికని చెప్పేందుకు అలా అన్నాను. నిజంగా బాలేదంటారా???
Post a Comment