ఋతురాగం ...




ఆరు ఋతువులు ఒక్కసారిగా ఆలపించిన రాగమేదో
మదిని మునకలేసేటి ఈ వేళ 
ఏమని చెప్పను ఓ నేస్తమా.... నా ఈ భావావేశమెట్టిదో...!

అనుభవాల అల్లికలో గతాన్ని వెతికే ప్రయత్నం... 
శరద్కాలపు వెన్నెల వీధిలో మేఘాన్వేషణా విధం! 
అర్ధంలేని ఆవేశపు జ్వాలలు దహించివేసే కోపం... 
గ్రీష్మ తాపం చెలరేగు నింగిలో ప్రభాకరుని ప్రతాపం!
అడియాశల అంచులలో వ్రేళ్ళాడు వేదన...
శిశిరం చుట్టుముట్టిన చీకటి శోధన!
ప్రేమామృత జల్లులు కురిసే చల్లని వేళ...
వర్షించే వయ్యారి వెండి మబ్బుల హేళ!
తొలి తొలి ఊహలు ఉదయించు పరువం...
పసి పసి హేమంతం కమ్ముకొను మరువం!
ఆలోచనా చినుకులు కురిసి మొలకెత్తు ఆశలు...
వసంతపు వేకువలో ముంగిట విరిసిన ముగ్గులు! 

సంగీతమెరుగని ఈ ఋతురాగాల స్వరాలాపనలో
మర్మమంటూ లేని ఈ మది భావాల మల్లె మాలికలో
ఊయలూగు నా ఈ భావావేశమెట్టిదో 
ఏమని చెప్పను ఓ నేస్తమా.... !!


4 comments:

కవితాంజలి... 19 July 2011 at 05:24

umm thnq.. :)

గోదారి సుధీర 19 July 2011 at 06:24

anukokundaa choosa mee blog baagundi .manchi kavithvam andamaina blog andukane annee chadivi vyakhyalu pettenduku prayatninchaa .keep it up.best wishes.

Krishna 23 July 2011 at 12:27

awesome అనే మాట చిన్నదేమో..!! మాటలలో ఎంత సున్నితత్వం!!!

కవితాంజలి... 25 July 2011 at 02:55

thanq krsna...

Post a Comment

Popular Posts

.