తెలతెలవారుఝామున
తెలతెల్లని తెలిమంచు తుంపరలు
తడితడిగా తడుముతుండగా...
సాగర తీరంలో, నీ సాంగత్యంలో...
తరుణాదిత్యుని అరుణిమను ఆస్వాదిస్తూ,
పతగపతులను పలకరిస్తూ,
తథాగతుని తిలకిస్తూ,
తన్మయమై, తమకానందమై....
ప్రభాత ప్రత్యూషమును వీక్షించాలని ఉంది ప్రియా...!
నా ఈ చిన్ని కోరికని మన్నిస్తావా....?
ఒక అద్భుతమైన అనూషమును నాకు అందిస్తావా.....?