అక్కడ పరదాల మాటున ఫత్వాలు ఎరుగని నీడలు కదలాడుతూ ఉంటాయి...!
హిజాబుల ముసుగులో హిసాబ్ తేలని ప్రశ్నలు వేళ్ళాడుతూ కనిపిస్తాయి...!
వెలుగు రేఖలకైనా చోటులేని ఇరుకు ఆవాసాలలో
చీకటి రంగుతో సహవాసాలు చేస్తున్న చూపులు,
ముజాహాబ్లు అంటుకుని మసిబారిపోయిన గోడల మధ్యన
ముడుచుకుపోయి, నలగిపోయిన మనసులు ఎదురవుతాయి...!
రెక్కలు కత్తిరించి పంజరంలో పడవేయబడ్డ పక్షులు
ఊచల కమ్మీలలోంచి చూస్తుంటాయి...!
ఆంక్షలు , ఆంక్షలు.... ఎటు చూసినా అడ్డుగోడలు ...
షబాబ్ శాపం ఒంటికి చుట్టుకుంటుంది...
గరీబ్ భూతం వెంటాడుతుంది...
అరబ్ అత్తరు ఒలికి బ్రతుకు బుగ్గవుతుంది ...!!
ఫత్వా= పరిష్కారం
హిజాబ్ = బురఖా
హిసాబ్= లెక్క
ముజాహాబ్ = మతం
షబాబ్= యవ్వనం
1 comments:
మీ కవిత్వం నిండా సప్త సముద్రాల ఘోష .
గుండెలఫై లేత పాదాలతో ఆడే పసి హృదయం .
అప్పుడే కొమ్మ చివర పూసే కోయల రాగం
రెమ్మ చాటుంచి విప్పారే పూల గానం
ఉదయాన కురిసే మంచు లో నుంచి మనసు లోకి నడిచోస్తున్నట్లుంది .....!
డాక్టర్ .వేంపల్లి గంగాధర్
Post a Comment