కన్నీరు





సంతోషాన్నిరెట్టింపు చేస్తుంది

బాధని సగం పంచుకుంటుంది

మనసు భారాన్ని తగ్గించేస్తుంది

ఒక లాలనాభరిత స్పర్శతో చెక్కిలి నిమిరి

తన ప్రేమనంతా తెలియజేస్తుంది

కంట నలుసు పడినా ఒప్పక

ఉప్పెనై ఉవ్వెత్తున ఎగసి పడుతుంది

ఎంతో సున్నితమైనది

మరెంతో స్వచ్చమైనది

జంట జాబిలుల దీపిక

కంటి కొలనులో నీరజ

నేల జారు నేత్రజ

కలల పంటకు సాగు నీరు

మృదుభావాల మూర్తీభవం

మనిషికున్న అతి పెద్ద ఆత్మీయ నేస్తం

అన్నీ తానే....






2 comments:

కాయల నాగేంద్ర 3 November 2011 at 17:33

సున్నితమైన,స్వచ్చమైన "కన్నీరు" కవిత బాగుందండి. 'మనిషికున్న అతిపెద్ద ఆత్మీయ నేస్తం'ఈ వాక్యం నాకు
బాగా నచ్చింది.

కెక్యూబ్ వర్మ 14 November 2011 at 07:58

బాగుంది ఆత్మీయంగా..దగ్గరగా...బ్లాగులోని కవితలన్నీ...

Post a Comment

Popular Posts

.