ఎదురుచూపెంత మధురం....!
ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని
ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను...
ఈ ఎదురుచూపుల ఉరవడితో
బరువెక్కిన కనురెప్పలమాటున
నువ్వు కదలాడుతుంటే...
కనులు మూసి నిన్ను చూడాలో
కనులు తెరిచి ఎదురుచూడాలో
తెలియక సతమతమైపోయే
నన్ను చూసి నవ్వుకుంటావు..!
నాకు మాత్రం... నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి
ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది...
నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది!
నువ్వే ఒక అద్భుతానివి!!
నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు...
ఇకనైనా నా చెంతకు చేరి
ఆ ఎడబాటుని, ఎడురుచుపుని చెరపనివ్వు ....
2 comments:
నిజమే ఎదురుచూపు శాపమో వరమో కాని బాధించే తీపినిస్తుంది. తీయన్ని బాధను రుచి చూపిస్తుంది. అయినా కాని అదొక మరువలేని అనుభూతిగా సాక్షాత్కరిస్తుంది. మీ కవిత బావుంది. అభినందనలు.
(Could you please remove word verification?)
ధన్యవాదాలండీ...
Post a Comment