నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను....!!



నా చుట్టూ ఎడారిని పరిచి 
నవవసంతం నడిచి వెళ్లిపోతుంటే...
ఎండమావి యెదలో నీ రూపం...
నా జన్మాదిలో నిన్ను ప్రేమించిన జ్ఞాపకం...
మది మూలాలు వెతుకుతుంటే 
నిధిలా నువ్వు దొరుకుతున్నావు!
నిన్ను అందుకోవాలని పరిగెడుతుంటే
ఇసుక ఊబులు నోళ్ళు తెరుచుకుని నిలబడుతున్నాయి!
తమలోకి నన్ను లాగుతున్నాయి!
నా పైన మేఘాలు... రాకాసి రాబందులవలె మేఘాలు...
ఒక్క చినుకైన రాల్చలేని చిక్కటి మేఘాలు...!
నల్లటి చీకటి కమ్ముకుని మింగివేస్తుంటే...
నా జన్మాంతంలోనూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను....!!

2 comments:

Krishna 27 July 2011 at 18:12

అదేంటి ఒక్కసారిగా అలా అనేసారు!!??!!

కవితాంజలి... 27 July 2011 at 22:18

ఎలా అన్నాను????

Post a Comment

Popular Posts

.