గుప్పిట తెరవగానే మిణుగురులు
మిలమిలలాడుతూ బిలబిల ఎగురుతూ నా భుజంపై వాలాయి
ఆ మినుగురుల మిసిమి వెలుగులో పసితనపు స్మ్రుతులెన్నో కదలాడుతున్నాయి
నింగి దిగివచ్చిన తారకల్లా నా చుట్టూ నాట్యమాడి
నన్ను తమ రెక్కలపై ఎక్కించుకుని గతకాలపు లోకాలలోకి పరుగుతీశాయి
అడుగడుగునా కనిపిస్తున్నఆత్మీయ నేస్తాలు...
ప్రతి మలుపులో పలకరించు ప్రాణ స్నేహాలు...
మరలిరాని ఆ మధుర క్షణాలని పూవులుగా అందించి నాకు స్వాగతం పలుకగా
అనుభూతో, ఆనందమో తెలియని ఒక భావావేశం పెల్లుబికి
తీయటి కన్నీరై చెక్కిలిని మృదువుగా నిమురుతూ జారుతుంది...!
1 comments:
చాలా భావయుక్తంగా ఉంది.
Post a Comment