October 31, 2011 -
Feelings,
Lady,
Nature,
Telugu,
Telugu poetry,
Women,
కావ్యం,
తెలుగు,
తెలుగు కవితలు
2
comments
పునర్జన్మ
-
friendship,
I Miss You,
prema kavithalu,
Sad,
Telugu,
Telugu poetry,
కావ్యం,
తెలుగు,
తెలుగు కవితలు,
ప్రేమ కవితలు
0
comments
ఎర్రటి చారికలు
October 30, 2011 -
Feelings,
Lady,
Nature,
Sad,
Telugu poetry,
Women,
కావ్యం,
తెలుగు,
తెలుగు కవితలు,
సామాజిక సమస్య
2
comments
తన్వీ
అందాల అంగడి బొమ్మ తాను...
అంగడికే అందం తాను...
అమ్మ అనారోగ్యమో,
నాన్న అప్పుల బాధో,
ప్రేమించిన వాడి మోసమో,
పిల్లల ఆకలో,
కటుంబ భారమో,
భారమనుకున్న కుటుంబమో
చూపించిన దారిలో ‘అలుపె’రగని బాటసారి తాను...
బ్రతుకు పోరాటంలో గెలుపెరగని యోధురాలు తాను...
విలువలు లేని వీధుల్లో ‘వెలవెల’బోతుంది తాను...
రోజుకొక పేరుతో పిలువబడే అనామిక తాను...
పూటకొక కొత్త పరిమళంతో విరబూయు మల్లిక తాను..!
నిత్యం విషసర్పాలు సంచరించే శరీరం
కొన్ని కోట్ల కాట్లు వేయించుకుంటుంది!
సగం కాలిన సిగరెట్ట్టు పీకలతో
అదనపు సింగారాలు చేయించుకుంటుంది!
చీకటి సాక్షిగా చిద్రమైపోతున్న బ్రతుకు
కొన్ని వేలసార్లు చచ్చిపోతుంది!
పందిరి మంచానికి కట్టిన పూల మాలలకి
అంతరాత్మ ఉరేసుకుని వేళాడుతుంది!
మగ కత్తుల వేటుకి తెగి పడుతున్న మానాన్ని చూసి
మనసు మౌనంగా రోదిస్తుంది!
పీడ కలల్ని పొదవుకున్నతన కళ్ళు...
ఒక్క కన్నీటి బొట్టైనా రాల్చలేవు!
రహస్యమంటూ ఎరుగని తన ఒళ్ళు...
రహస్యమంటూ ఎరుగని తన ఒళ్ళు...
పక్క మీద తప్పా పనికిరాదు!!
తానొక అలౌకిక..
తానొక పరాజిత..
తానొక విధి వంచిత...
తానొక అనర్ధ అశాతీత అనాధ..!!
-
Feelings,
I Miss You,
Lady,
prema kavithalu,
Sad,
Telugu,
Telugu poetry,
కవిత,
కావ్యం,
తెలుగు,
తెలుగు కవితలు,
ప్రేమ కవితలు
0
comments
అంతర్మధనం
October 17, 2011 -
Feelings,
Hijra,
Nature,
Sad,
Telugu,
Telugu poetry,
కావ్యం,
తెలుగు,
తెలుగు కవితలు,
సామాజిక సమస్య
5
comments
నేను అసంపూర్ణుడను
అసంపూర్ణమైన అక్షరాలతో నా విధిరాత లిఖించబడింది.
అసంపూర్ణమైన అవయవాలు నాకు అమర్చబడినాయి.
అసంపూర్ణంగా పుట్టి, అసంపూర్ణంగా పెరిగి,
‘అసంపూర్ణుడి’గా ముద్రించబడ్డాను.
కన్నవాళ్ళకి నేనొక పరువునష్టాన్ని!
తోడబుట్టినవాళ్ళకి బ్రతుకు భారాన్ని!!
నాకు పేరు లేదు, ఊరు లేదు, సమాజంలో చోటు లేదు.
నన్ను అక్కున చేర్చుకోని ఈ సమాజం...
నన్ను ‘లెక్క’ చేయని ఈ సమాజం...
నా హక్కులను మాత్రం లాగేసుకుంది!!
నా శరీరమొక వినోద వస్తువు
నా వేషమొక వింత జంతువు
గుర్తింపు లేని నా ముఖం పైన
నా భావాలను కనిపించనియ్యక ఉండేందుకు
రకరకాల రంగులతో కప్పుతాను
అసంపూర్ణమైన ఈ శరీరంలో సంపూర్ణమైన మనసొకటుంది
అది నవ్వుతుంది...
ఏడుస్తుంది...
ఆశపడుతుంది....
ఎన్నెన్నో భావాలను మోస్తుంది....!
కొన్ని వేలసార్లు ముక్కలవుతుంది...! !
కొన్ని వేలసార్లు ముక్కలవుతుంది...!
కానీ... దాని ఆచూకి కనుగునేదెవ్వడు?
దాని గోడు వినేదెవ్వడు?
రోజూ ఎన్నో రకాల చూపులు నన్ను తాకుతాయి
ఆకలిగా చూసేవి, అసహ్యంగా చూసేవి,
అలవాటుగా చూసేవి, ఆటపట్టింపుగా చూసేవి,
ఎన్నో, ఎన్నెన్నో చూపులు నా శరీరంగుండా దూసుకెళతాయి
కానీ... నా కళ్ళు మాత్రం ...
నన్ను కూడా ‘మనిషి’గా చూసే చూపు కోసం వెతుకుతాయి
వెతికి వెతికి అలిసిపోయి, నీరైపోయి
ఏ ‘పరిపూర్ణుడి’ మంచం మీదనో ఇంకిపోతాయి!!
October 15, 2011 -
I Love You,
I Miss You,
prema kavithalu,
Sad,
Telugu,
Telugu poetry,
కావ్యం,
తెలుగు,
తెలుగు కవితలు,
ప్రేమ కవితలు
3
comments
నీకు తెలుసా...
Subscribe to:
Posts (Atom)
My Blog List
-
-
ఈ లాక్డౌన్ లో ఇలా గడిపాను!4 years ago
-
Random Amateur lines7 years ago
-
West Ham Tertarik Datangkan Walcott7 years ago
-
-
కలల అక్షరం8 years ago
-
-
Popular Posts
-
ఎదురుచూపెంత మధురం....! ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను... ...
-
ఏమిటో ఈ పిచ్చి మనసు! నిన్ను చేరాలని పరుగులు తీస్తుంది నిన్ను తాకాలని ఉరకలు వేస్తుంది నీ మాట వినగానే పులకించి పోతుంది ఎన...
-
నీ చిరునవ్వు... మల్లెమొగ్గ విచ్చినట్టు చల్లగాలి వీచినట్టు మంచుచుక్క తాకినట్టు సన్నజాజి పాకినట్టు నీ చిరునవ్వే... జలపాతం జారినట...
-
ప్రియమైన నీకు , నిన్నటి నీ లేఖ ఇప్పటికి అసంఖ్యాకంగా చదువుకున్నాను..! ( అందులోని నీ ముద్దులని కూడా...) లేఖను వ...
-
తల్లి పేగుని తెంపుకుని విడివడిన క్షణం నువ్వు అడుగుపెట్టింది విశాలమైన ప్రపంచం లోకి కాదు ఒక శాశ్వతమైన ఒంటరితనం లోకి నడక నేర్చింది మొదల...
-
తానొక ఆద్యంతాలు లేని పదం కళ్ళు తెరవక మునుపే కన్నుమూస్తుంది తానొక విష వలయంలో కమలం రేకువిప్పకుండగనే వ...
-
లోకమంతా నిదురిస్తోంది.. నేను తప్ప! తెల్లవార వస్తోంది.. నాకు తప్ప!! ఎంత వెతికినా నిద్దుర దరిదాపుల్లో కానరావటమే లే...
-
బంధాలు... బాధల్ని మిగుల్చు సాధనాలు! ప్రేమలు... మనసుని పీడించు పిశాచాలు ! ఆప్యాయతలు... అందమైన అబద్దాలు! ఆశలు... ఆలోచ...
-
వాన పడేలా ఉంది మబ్బు పట్టింది ఆకాశమేనా? చిత్తడి నేల తడింకా ఆరనేలేదు మళ్ళీ చినుకు రాలుతోంది తడిసిపోతున్న తలపులే సాక్ష్యంగా..! ...
-
వెన్నెల గోదారి..... వెండంచు అలల చీర చుట్టుకుని నిండార స్నానమాడి వయ్యారాల వంపుల మధ్య తన్మయావస్థలో ఉన్న తడి వస్త్రాన్న...
.