అక్కడేదో విస్ఫోటనం జరిగింది!!
దిక్కులదిరే ధ్వనితో దద్దరిల్లుతూ
పెద్ద అగ్ని బుడగ గాలిలోకి లేచింది....
బండరాళ్ళను మైనపు ముద్దల్లా కరిగించివేస్తూ
వేడి సెగలు వెలివడుతున్నాయి....
పిశాచాల ఆకారాలు తొడుక్కున్న పొగలతో కలిసి,
కాలుతున్న పచ్చి మాంసపు వాసన
వాయుకోశాలలో చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది....
ఎగసిపడుతున్న అగ్ని శిఖలు వదిలే
కాలభస్మ పొంకణాల గుట్టలు,
వాటి మధ్య చెల్లాచెదురుగా పడివున్న
ప్రేతకాయాల, అస్థి అవశేషాల పుట్టలు....
మరుభూమిని తలపిస్తూ
ఒక భయానక భీబత్స వాతావరణం అలముకుంది!!
ఆ విస్పోటనపు వింతలు వీక్షిస్తున్న పాపరక్షసినై నేను...!
ఒంటికి అంటుకున్న బూడిద మరకలు
చెదలు పట్టిన శవాల కుణపగంధము కలగలిపి
కదిలే స్మశానాన్న తలపిస్తూ నేను...!
మెల్లమెల్లగా పొరలుపొరలుగా విడివడుతూ
విచ్ఛిన్నం చెందుతూ మరొక విస్ఫోటనమై వెలుస్తూ నేను...!!
1 comments:
బావుంది ప్రియా. కాని ఈ విస్ఫోటనం దేని చుట్టు తిరుగుతుంది. కొంచెం వివరించండి.
Post a Comment