విన్నపం



కరిగిపో హృదయమా...
ఈ హృదయ జ్వాలల వేడిలో కరిగిపో...!
తడిచిపో నేత్రమా...
ఈ కన్నీటి కెరటాల ధారలో తడిచిపో...!
అలసిపో ప్రాణమా...
ఈ భారమైపోయిన ఊపిరి మోతతో అలసిపో...!
మరచిపో మస్తిష్కమా...
నీ భూత భవిష్యత్ వర్తమానాల కొలమానాలను మరచిపో...!
నడిచిపో నేస్తమా...
నా అణువణువునూ చీల్చుకుంటూ నడిచిపో...!


4 comments:

♛ ప్రిన్స్ ♛ 27 April 2012 at 11:59

nice

బాలకృష్ణా రెడ్డి 27 April 2012 at 16:47

కవితాంజలి ,
నిజంగానే కరిగిపోయాను
తడిసి పోయాను అలసి పోయాను
మీ కవితలన్నీ బాగున్నాయి
కారణం నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి
పుప్పొడి రాలిన చప్పుడు, కిలికించితాలు..వంటి కావ్యాలు రాశాను
ప్రేమ ఆరాధన ప్రణయం అంటూ ఇంకా కావ్యాలు ఉన్నాయి
ఒకసారి నా బ్లాగ్ లోనికి తొంగి చుడండి
మీ కవితా రచనా పటిమకి అభినందనలు
http://kavitandhra.blogspot.in/

చెప్పాలంటే...... 27 April 2012 at 22:32

baavundi andi

anvitha priyanshu 28 April 2012 at 23:51

కరిగి,తడిచి,అలసి,మరచి.....నడిచిపొవాలా...బాగా కూర్చి రాసారండి...పాట మధురాతి మధురం

Post a Comment

Popular Posts

.