తానొక విష వలయంలో కమలం
రేకువిప్పకుండగనే వాడిపోతుంది
తానొక అందమైన హరివిల్లు
విషమొకటి వొలికి వివర్ణమవుతుంది
తానొక అరవిరిసిన పుష్పం
నెత్తుటిలో తడిసి ముద్దవుతుంది
తానొక స్వచ్చమైన శ్వేత ముత్యం
ముక్తాగార కారాగారంలో బంధీయైపోతుంది
తానొక చీకటి గుహలో దీపం
ఆ దావానలంలో దహించుకుపోతుంది
తానొక పరిమళం తగ్గిన మరువం
వెలివడి వీధిన పడుతుంది
స్త్రీ...
తానొక ఒంటరి అక్షరం..!!
సృష్టి మొదలు, నేటి వరకూ
తన ఉనికి కోసం తాను వెతుకుతూనే ఉంది !
గెలుపెరుగని ఒంటరి పోరాటం సాగిస్తూనే ఉంది !!
6 comments:
ఆడవాళ్ళని మగవాళ్ళు పొగిడితే బావుంటుంది.
అది పొగడ్త కాదండీ... ఆవేదన.
thnq krsna ji
నా బ్లాగ్ లో మీ పేరు చూసి., మీ మనసుపొరల్లోకి అడుగు పెట్టాను. ముఖ్యంగా 'స్త్రీ' భావవ్యక్తీకరణ, శైలి చాలా బాగున్నాయి. ఇలాంటి రచనలు ఇంకా చేయగలరని నమ్ముతున్నాను. అభినందనలు అపరంజిత గారు.
ధన్యవాదాలు రామకృష్ణ గారు... మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే తప్పకుండా రాస్తానండి..
madam mee stee kavith adbhuthamga undi
Post a Comment