వృధాప్రయాస



ఎందుకీ తీక్షణ సారంగి తంత్రులపైని నడక?
అరికాళ్ళను తెంపుతూ తోడిరాగాన్ని పలికించేందుకా??
ఎందుకీ లవణ సలిల తటంపైని పడక?
ఆరిపోని దాహాగ్నిని ఆజ్యమేసి పెంచేందుకా??
ఎందుకీ జ్వలిత ఆస్పదం పైని ఆవాసం?
దేహమంతా దహించివేసి భస్మ ప్రతిమై నిలిచేందుకా??
ఎందుకీ శ్వాసరహిత సంకీర్ణ దారులలో పయనం?
మిగిలి ఉన్న ఊపిరిని వంపి వలకబోసుకునేందుకా??
ఎందుకీ స్వయం క్షయ కాంక్ష??
ఎందుకీ అత్యాశ?
ఎందుకీ వృధాప్రయాస?


2 comments:

Padmarpita 28 April 2012 at 17:00

నిజమేకదా?
ఎందుకీప్రయాస?:-)
Pic is good.

anvitha priyanshu 28 April 2012 at 19:49

మీ వర్ణన అద్బుతం...మీ హ్రుదయ స్పందన ఆహ..చాలా బగుందండి

Post a Comment

Popular Posts

.