నిగూఢమైన నిప్పులన్నీ పోగేసుకుని
మండుతున్న అగ్నిగోళం నువ్వైతే
అగ్నికి ఆయువందించే వాయువు నేనై
వస్తాను
నీ నిప్పు కణాలలోకి జొరబడి
రగిల్చి రగిల్చి నిన్ను మరింతగా
మరిగించి
నిన్నంటుకున్న సెగలో నేనూ రగిలి
జ్వలితనై సుడులు తిరుగుతూ
పైకెగసి
జడలు విప్పిన అగ్నిశిఖలా మిన్నంటి
నిన్ను నాలో నింపుకుని...
నన్ను నీకు అర్పించుకుని...
నీలో నేను లీనమై లయమై ఆహుతైపోతాను...!!
1 comments:
Wow Wow ! So passionate...
Lovely
Post a Comment