మన మధ్యన ఈ పొగమంచు తెరలు...
కదలాడుతున్న నీలి నీడలు...
గాలి తెమ్మరకి చెదిరినట్టే
చెదిరి
మళ్ళీ కమ్ముకుంటూ...
అటువైపు నీ రూపం
అస్పష్టంగానైనా అపురూపంగా కనిపిస్తూ...
వేలుగురేఖల సూదిమొనలు గుచ్చుకుని
విచ్చిన్నమవుతూ మంచు రేణువులు
నీ నీలి నీడ రూపాన్ని కరిగిస్తూ...
అస్పష్టాన్ని ఇంకాస్త సంక్లిష్టం
చేస్తూ...
అడ్డుగా ఉన్నది పొగమంచు కాదని
అద్దాల మేడని అనుభావకంగా
తెలుపుతూ...
నీటి బిందువులై నేల జారుతున్నాయి...!!
1 comments:
చిత్రాన్ని భావిచిత్రంగా చూపించిన మీకు జోహారు !!
Post a Comment